

హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వ్యంగ్యాత్మక బ్లాక్ కామెడీ చిత్రం ‘డిగ్గర్’ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఆస్కార్ విజేత దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్యారిటు తెరకెక్కించిన ఈ చిత్రంలో రిజ్ అహ్మద్, సాండ్రా హుల్లర్, జాన్ గుడ్మన్, జెస్సీ ప్లెమన్స్, మైఖేల్ స్టుల్బార్గ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. రాటెన్ టొమాటోస్‌లో 52 శాతం స్కోర్‌తో ప్రారంభమైంది. వెరైటీ అంచనా ప్రకారం ఉత్తర అమెరికాలో తొలి వారాంతంలో 12 నుంచి 15 మిలియన్ డాలర్ల వసూళ్లు రావచ్చని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తేనే సినిమా ఖర్చులు రాబట్టుకునే అవకాశం ఉందని సమాచారం. 2017లో వచ్చిన ‘అమెరికన్ మేడ్’ తర్వాత టామ్ క్రూజ్ నటిస్తున్న తొలి ఒరిజినల్ చిత్రం ‘డిగ్గర్’. బ్లాక్ కామెడీ కావడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారవచ్చనే అంచనాల మధ్య టామ్ క్రూజ్ సినిమాను విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు వార్నర్ బ్రదర్స్‌కు ఈ ఏడాది పలు భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ‘డిగ్గర్’పై అంచనాలు మరింత పెరిగాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!