

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. మొదట ప్రకటించిన తేదీ కంటే ముందుగా, ఈ చిత్రం జూలై 30, 2026న భారతదేశంలోని థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే జూన్ 17 నుంచి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 1 బిలియన్ వ్యూస్‌ను దాటుతూ విశేష రికార్డును సృష్టించింది.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ తర్వాతి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం, పీటర్ పార్కర్ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించనుంది. న్యూయార్క్ నగరాన్ని రక్షించేందుకు అతడు ఎదుర్కొనే సవాళ్లు, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాటం ప్రేక్షకులకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెటన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయా, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్థల్, సాడీ సింక్ కీలక పాత్రలు పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!