

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ను త్రిష కృష్ణన్ తొలి రోజే తన స్నేహితులతో కలిసి వీక్షించారు. సినిమా అనంతరం తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ కాగా, విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించిందని ఆమె స్నేహితులు పేర్కొన్నారు. త్రిష తల్లి ఉమా కృష్ణన్ కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ, నటుడిగా విజయ్‌కు ఇది చివరి చిత్రం కావడం బాధగా ఉందని తెలిపారు.
సెన్సార్ సంబంధిత కారణాలతో నెలల తరబడి ఆలస్యంగా విడుదలైనప్పటికీ, ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, తొలి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్, భారత్‌లో సుమారు రూ.41 కోట్ల నెట్ వసూలు చేసింది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు అభిమానులు ఘనంగా వీడ్కోలు పలుకుతూ, వెండితెరపై ఆయనను మిస్ అవుతామని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!