

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, యువిన్, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో త్రివిక్రమ్ ప్రమోషన్స్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్‌తో పలు స్పెషల్ ఇంటర్వ్యూలతో పాటు ప్రత్యేక టూర్లను కూడా నిర్వహించనున్నారని సమాచారం. త్రివిక్రమ్ స్వయంగా కూడా సినిమా కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో ఇంటర్వెల్ సమయంలో నారా రోహిత్ ఎంట్రీ ఊహించని విధంగా ఉంటుందని టాక్. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ప్రధాన ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం. దీంతో ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!