
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నటుడు అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదానికి దారితీసింది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లు రూపొందించిన చిత్రాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆ చిత్రంలోని జాతీయ పతాకంలో అశోక చక్రం సరిగా కనిపించకపోవడాన్ని నెటిజన్లు గుర్తించారు. దీంతో జాతీయ పతాకాన్ని సరిగ్గా చూపించకుండా పోస్ట్ ఎలా చేశారంటూ పలువురు విమర్శలు, ట్రోల్స్ చేశారు.
మరికొందరు జాతీయ పతాకంలోని అశోక చక్రం కనిపించకపోయినా, పోస్టర్‌లో అల్లు అర్జున్ ‘AA’ లోగో మాత్రం స్పష్టంగా కనిపిస్తోందంటూ విమర్శించారు. ఈ వివాదం నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ తన పోస్ట్‌ను వెంటనే తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!