
జనరల్

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ పొందుతోంది. రామ్ చరణ్ తన నటనతో అభిమానులను అలరిస్తుండగా, సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో అభిమానులు ప్రత్యేక ప్రదర్శనలను ఘనంగా నిర్వహిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉపాసన కొణిదెల హైదరాబాద్ బాలానగర్‌లో జరిగిన ప్రత్యేక ప్రదర్శనకు హాజరై అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. రామ్ చరణ్ ఎంట్రీ సన్నివేశాల సమయంలో అభిమానులతో కలిసి ఉత్సాహంగా స్పందిస్తూ థియేటర్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో పలువురు సినీ ప్రముఖులు రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!