

టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ సోలో హీరోగా మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన చివరిసారిగా గద్దలకొండ గణేష్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. తరువాత ఎఫ్ 3 చిత్రంతో మరో విజయం సాధించినప్పటికీ అది మల్టీస్టారర్‌గా వచ్చింది. అయితే గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. తాజాగా విడుదలైన కొరియన్ కనకరాజు సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
ఇంతకు ముందు ఆయన నటించిన చిత్రాల తొలి రోజు వసూళ్లు తక్కువగానే నమోదయ్యాయి. మట్కాకు రూ.65 లక్షలు, ఆపరేషన్ వాలెంటైన్‌కు రూ.80 లక్షలు, గాండీవధారి అర్జునకు రూ.75 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే కొరియన్ కనకరాజు చిత్రం మొదటి రోజే రూ.3.16 కోట్ల వసూళ్లు సాధించి భారీ జంప్ చూపించింది. ఈ ఓపెనింగ్స్ వరుణ్ తేజ్ కెరీర్‌కు మంచి ఊరటనిచ్చే అంశంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!