
సినిమాలు

ఈ మధ్యకాలంలో సీనియర్‌ల నుంచి జూనియర్ హీరోల వరకు ఒక్క సినిమాకు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ మాత్రం భిన్నమైన ప్లాన్‌తో వరుసగా రెండు ప్రధాన పండగ సీజన్లను టార్గెట్ చేస్తున్నాడు. టాలీవుడ్‌లో ఎక్కువగా సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలోనే పెద్ద సినిమాలు విడుదలవుతాయి.
ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “ఆదర్శ కుటుంబం” సినిమా, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుండగా, అనిల్ రావిపూడి సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెంకటేష్ వరుసగా దసరా, సంక్రాంతి రెండు పెద్ద సీజన్లను టార్గెట్ చేసినట్లైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!