
సినిమాలు

విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో రూపొందిన భావోద్వేగ డ్రామా “వంద దేవుళ్ళు” తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైంది. ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విజయ్ ఆంటోనీకి ‘బిచ్చగాడు’ సినిమా పెద్ద విజయంగా నిలిచింది.
ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను ఈ రెండు ప్రముఖ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇటీవల వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాకాస’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘వంద దేవుళ్ళు’ పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌తో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!