

నటుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జననాయగన్ చిత్రం సెన్సార్ సమస్యలతో ఎదురుదెబ్బ తగిలింది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా నిర్మాణం సజావుగా పూర్తయినా, సెన్సార్ సర్టిఫికెట్ దశలోనే ప్రధాన సమస్య ఎదురైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్ వినోత్ కూడా ఇలాంటి అడ్డంకులు వస్తాయని ఊహించలేదు. ఎన్నికల సమయం, విజయ్ రాజకీయ ప్రవేశం, అలాగే సినిమాలోని కొన్ని చర్చనీయాంశ సన్నివేశాలు ఈ సమస్యకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.
జనవరి నుంచి సుమారు ఆరు నెలలుగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ఈ మధ్యలో చిత్రం అనధికారికంగా ఇంటర్నెట్‌లో లీక్ కావడం యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. నిర్మాత వెంకట్ నారాయణన్ సమస్య పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లి సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 19లోగా సర్టిఫికెట్ వస్తే, 25న సినిమాను విడుదల చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. విజయ్ అభిమానులు విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!