

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’పై హీరో విరాట్ కర్ణ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించడం తన కెరీర్‌లో గొప్ప అవకాశమని పేర్కొన్నారు. పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డానని, 20 కిలోల బరువు పెరిగి, తర్వాత పాత్ర అవసరాలకు అనుగుణంగా మళ్లీ బరువు తగ్గానని చెప్పారు. గుర్రపు స్వారీ, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని, సినిమాలో ఒక్క ఫైట్‌కూ డూప్ ఉపయోగించలేదని వెల్లడించారు.
ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని విరాట్ కర్ణ ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో జ్వరం, గాయాలు, తీవ్రమైన చలి వంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని వెల్లడించిన ఆయన, మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని చెప్పారు. నభా నటేష్ పాత్ర చిత్రంలో ఎంతో కీలకమని, భారీ విజువల్స్, గ్రాండ్ యాక్షన్, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలిపారు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!