
సినిమాలు

సంక్రాంతి బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి భారీ మల్టీస్టారర్ చిత్రం VenkyAnil5 - NKRAnil2 కోసం ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఎంపిక చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
జీవీ ప్రకాశ్ ఎంట్రీని ప్రకటిస్తూ అనీల్ రావిపూడి ఓ సరదా వీడియోను విడుదల చేశారు. పాత వీడియో కాన్సెప్ట్‌ను ఇద్దరూ కలిసి రీక్రియేట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులతో వెంటనే కనెక్ట్ అయ్యే సంగీతాన్ని అందించగల జీవీ ప్రకాశ్ ప్రతిభను ప్రశంసించిన అనీల్, ఈ ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని మధుర జ్ఞాపకాలు సృష్టించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!