

దర్శకుడు శంకర్, మహేశ్‌బాబుతో సినిమా చేయడానికి గతంలో పలుమార్లు ప్రయత్నించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ రెండు సందర్భాల్లో ప్రకటన దశ వరకు వెళ్లినా కార్యరూపం దాల్చలేదని కథనాలు ఉన్నాయి. ‘పోకిరి’ విజయం తర్వాత శంకర్ మహేశ్‌కు ఓ విభిన్నమైన ప్రేమకథను వినిపించారని, అయితే కథ నచ్చకపోవడంతో మహేశ్ ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
ఆ తర్వాత హిందీలో విజయవంతమైన ‘3 ఇడియట్స్’ను తెలుగులో రీమేక్ చేయాలని శంకర్ భావించినప్పుడు కూడా మహేశ్‌బాబును ప్రధాన పాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. మహేశ్ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ, అనంతరం ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. రీమేక్ చిత్రాలపై ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణమని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. చివరకు ‘స్నేహితుడు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం మహేశ్‌బాబు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలోని భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు.మహేశ్ బాబు, శంకర్, మహేశ్ శంకర్ కాంబినేషన్, పోకిరి, 3 ఇడియట్స్, స్నేహితుడు, తెలుగు సినిమా, టాలీవుడ్, రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలు













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!