
జనరల్

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ జూలై 10న థియేటర్లలో విడుదల కానుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదలకు ముందు చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
ఈ సందర్భంగా ‘లెనిన్’ టైటిల్ రాజకీయాలకు లేదా కమ్యూనిజానికి సంబంధించినదా అనే ప్రచారంపై అఖిల్ స్పందించారు. ఈ సినిమాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని స్పష్టం చేశారు. దర్శకుడికి ఆ పేరుపై ఉన్న అభిమానం వల్లే ఈ టైటిల్‌ను ఎంపిక చేశారని, కథలో ప్రజలను నడిపించే సహజ నాయకత్వ లక్షణాలు ఉన్న యువకుడి పాత్రకు ఈ పేరు సరిపోతుందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!