
క్రీడలు

టాలీవుడ్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయికల్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. నటనతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను సంపాదించుకున్న ఆమెకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కమర్షియల్ బ్లాక్‌బస్టర్ మాత్రం దక్కలేదు. ‘మిస్టర్ బచ్చన్’, ‘కింగ్‌డమ్’, ‘కాంత’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి చిత్రాలపై మంచి అంచనాలు నెలకొన్నా, అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఇప్పుడు ఆమె ఆశలన్నీ అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’పైనే ఉన్నాయి. నాగ వంశీ, నాగార్జున నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ‘లెనిన్’ కమర్షియల్‌గా విజయాన్ని అందుకుంటే, భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో అది కీలక మలుపుగా మారి, ఆమెకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తొలి పెద్ద విజయాన్ని అందించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!