

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘తలైవర్ 173’ చిత్రం రోజురోజుకీ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కథ, పాత్రల రూపకల్పనలో చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ప్రత్యేక లుక్ టెస్ట్ నిర్వహించి తుది రూపాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని పూనమల్లిలో భారీ సెట్లు నిర్మిస్తుండగా, నటీనటుల ఎంపిక కూడా చివరి దశకు చేరుకుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!