

బెంగళూరులో ఘనంగా జరిగిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ, ఇది తన సినిమా మాత్రమే కాదని, ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో రూపొందించిన చిత్రమని అన్నారు. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌లో యశ్ రాయా, టికెట్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్, ఎమోషన్, సంబంధాలు, అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ యశ్ ఎదుగుదల తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. నిర్మాత కేవీఎన్ వెంకట్, దర్శకురాలు గీతు మోహన్‌దాస్, సంగీత దర్శకుడు రవి బస్రూర్ సహా చిత్ర బృందం కృషిని యశ్ ప్రత్యేకంగా అభినందించారు. దాదాపు 200 రోజుల పాటు కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో చిత్రీకరించిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. ‘టాక్సిక్’ ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇండియన్ సినిమాకు కొత్త గ్లోబల్ గుర్తింపును తీసుకురావాలని యశ్ ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!