
జనరల్

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమా.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ ప్రేమకథను చూసే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!