
జనరల్

హర్షిత్ రెడ్డి నటించిన ‘దీవాన’ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదిక ఆహాలోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని చేరుకోవడం విశేషం. మంచి కథ, భావోద్వేగాలతో కూడిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని ఈ విజయం మరోసారి నిరూపించింది.

అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రంతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయమయ్యారు. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు తదితరులు నటించిన ఈ సినిమాకు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ థియేట్రికల్ రిలీజ్ అందించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!