

కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు సూరి విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులోని తీర ప్రాంతాల్లో సంప్రదాయంగా జరిగే పడవల పోటీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే నేడు రూ.100 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వాణిజ్య విజయంపై చిత్ర దర్శకుడు మతిమారన్ పుగళేంధి పనిని ప్రశంసిస్తూ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ స్పందించారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచి తన వద్ద పనిచేసిన పలువురు అసిస్టెంట్లు దర్శకులుగా మారే వరకు సుమారు 15 నుంచి 20 సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను నిశితంగా గమనించానని చెప్పారు. అయితే తాను చూసిన తొలి బ్లాక్‌బస్టర్ చిత్రం ఇదేనని, ఈ విజయంపై ఎంతో సంతోషంగా ఉన్నానని వెట్రిమారన్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!