

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి RC-17 కోసం జతకడుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి కోలీవుడ్ యువ నటుడు రిషికాంత్ హాజరుకావడంతో ఆయన పాత్రపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. మొదరాత్రి, డోరతి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రిషికాంత్.. రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్తలు ప్రచారమయ్యాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించిన రిషికాంత్.. తాను RC-17 సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మొదరాత్రి చిత్రానికి తాను పనిచేశానని, ఆ పరిచయం కారణంగానే నిర్మాతలు రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమానికి ఆహ్వానించారని తెలిపారు. వారి ఆహ్వానం మేరకే వేడుకకు హాజరయ్యానని వివరించారు. సినిమా విడుదలయ్యే వరకు పుకార్లు కొనసాగనివ్వకుండా, అసలు విషయాన్ని ముందుగానే తానే స్పష్టం చేస్తున్నానని అన్నారు. అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దని మీడియా, అభిమానులను కోరారు. రిషికాంత్ ఇచ్చిన వివరణతో RC-17లో ఆయన నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలకు తెరపడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!