

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే 09Rకు సంబంధించి CAT III ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ (AGL) సదుపాయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎంఆర్ ఏరో నేతృత్వంలోని కన్సార్టియం ఆధ్వర్యంలో ఈ సామర్థ్యాన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న CAT II సామర్థ్యాన్ని CAT III స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా దృశ్యమానత తగ్గినప్పటికీ విమాన కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా విమానాల దారి మళ్లింపులు, ఆలస్యాలను తగ్గించేందుకు ఈ సదుపాయం దోహదపడనుంది.
ఈ అప్‌గ్రేడ్‌తో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాల రాకపోకల్లో అంతరాయాలు తగ్గి, ప్రయాణ షెడ్యూళ్లు మరింత విశ్వసనీయంగా ఉండనున్నాయి. ప్రయాణికులకు సులభమైన, మెరుగైన ప్రయాణ అనుభవంతో పాటు కనెక్టివిటీ ప్రయోజనాలు లభించనున్నాయి. విమానయాన సంస్థలు కూడా తక్కువ దృశ్యమానత పరిస్థితుల్లో కార్యకలాపాలను మరింత నిరంతరాయంగా కొనసాగించేందుకు, సమయపాలనను మెరుగుపరుచుకునేందుకు వీలవుతుంది. హైదరాబాద్ విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ సదుపాయం కీలక ముందడుగుగా నిలవనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!