

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరు కామెడీ సిరీస్‌గా ఆకట్టుకుంటుంది. హర్ష చెముడు సహజమైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తాడు. అతడి హావభావాలు, అమాయకత్వం కామెడీ సన్నివేశాల్లో బాగా పనిచేస్తాయి. శ్రీ విద్యా జ్ఞానకుమార్ తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జీవన్ రెడ్డి, హైపర్ ఆది తో ఆమె చేసే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. హైపర్ ఆది పంచ్ డైలాగులు నవ్వులు పూయించగా, కార్పొరేట్ బాస్ పాత్రలో జీవన్ రెడ్డి సహజంగా కనిపిస్తాడు. టీమ్ లీడ్‌గా ఐశ్వర్య హోలక్కల్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది.
అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, చివరి ఎపిసోడ్లలో సన్నివేశాలు సాగదీయడం సిరీస్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రారంభంలో ఆకట్టుకున్న కామెడీ తర్వాతి భాగాల్లో కొంత తగ్గుతుంది. ఆఫీస్ వాతావరణాన్ని మరింత సమర్థంగా ఉపయోగించి ఉంటే సహజమైన హాస్యం పండేది. దర్శకుడు బాబు డేగల కామెడీ సన్నివేశాలను బాగానే తెరకెక్కించారు. శక్తి అరవింద్ కెమెరా పనితనం, అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కు తోడ్పడ్డాయి. అయితే, చివరి ఎపిసోడ్లలో ఎడిటింగ్ మరింత పకడ్బందీగా ఉండాల్సింది. మొత్తంగా, కథ సాధారణంగా ఉన్నప్పటికీ, మంచి నటన, క్లీన్ కామెడీతో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఒకసారి చూడదగిన సిరీస్‌గా నిలుస్తుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!