
క్రీడలు

తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించిన ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సూరి, సుహాస్‌తో పాటు సత్యరాజ్, మహిమా నంబియార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!