

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత రెండో సీజన్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమంతో దూత 2 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు నాగార్జున క్లాప్ కొట్టి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 2023లో విడుదలైన తొలి సీజన్‌తో నాగచైతన్య ఓటీటీ రంగంలో నటుడిగా విజయవంతమైన అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
ఈసారి దూత 2తో నాగచైతన్య నిర్మాతగా కూడా కొత్త బాధ్యతలు చేపడుతున్నారు. కథపై, ప్రాజెక్ట్‌పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ మరోసారి సిరీస్‌కు దర్శకత్వం వహించనుండగా, శరత్ మరార్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!