
జనరల్

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఓటీటీలో కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. జూలై 17 నుంచి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన తర్వాత డిజిటల్ వేదికలోనూ టాప్ ట్రెండింగ్లో నిలిచింది.
సుమారు రూ.27 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా దాదాపు రూ.35 కోట్ల ఆదాయం సాధించినట్లు సమాచారం. సమంత నటన, యాక్షన్ సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో జియోహాట్స్టార్లో అత్యధికంగా వీక్షిస్తున్న దక్షిణాది చిత్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!