
జనరల్

ఈరోజు పలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జియోహాట్‌స్టార్‌లో థుక్రా కె మేరా ప్యార్ సీజన్ 2, సేవ్ ది టైగర్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి. సోనీ లివ్‌లో మలయాళ చిత్రం అతిరడి, ఆహాలో తెలుగు చిత్రం రేజర్ విడుదలయ్యాయి. అలాగే లయన్స్్‌గేట్ ప్లేలో అలియా బసు గయబ్ హై, మ్యాచ్ పాయింట్, మోటివ్ ఫర్ మర్డర్ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఓయాసిస్ సీజన్ 1, వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసాబెల్, హస్బెండ్స్ ఇన్ యాక్షన్ విడుదల కాగా, యాపిల్ టీవీ ప్లస్‌లో షుగర్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. హెచ్‌బీఓ మ్యాక్స్‌లో హౌ టు మేక్ ఎ కిల్లింగ్, షడర్‌లో ది వాయిసెస్ ఆఫ్ అవర్ మదర్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. విభిన్న భాషలు, జానర్లలో వచ్చిన ఈ కంటెంట్ ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!