2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

Writer: Pooja 12:36 PM, 2 నవంబర్, 2026
విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

విమాన టికెట్ల ధరలు అనూహ్యంగా పెరగకుండా నియంత్రించడంతో పాటు ఛార్జీల విషయంలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతీయ వాయుయాన్‌ అధినియమ్‌-2026’ నిబంధనలను నోటిఫై చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో మార్పుల కారణంగా విమాన ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అసాధారణ పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాల దృష్ట్యా జోక్యం అవసరమని భావిస్తే విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు. టికెట్ ధరలపై నిర్దిష్ట గరిష్ఠ పరిమితిని విధించకపోయినా, ఛార్జీలను పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారులు ఉంటారు. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్‌ కాలం నాటి విమానయాన చట్టం స్థానంలో కేంద్రం 2024లో భారతీయ వాయుయాన్‌ అధినియమ్‌ను తీసుకొచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్లు, డిజిటల్‌ వేదికల్లో టికెట్‌ ధరలను తప్పనిసరిగా ప్రచురించాలి. ఛార్జీలను పర్యవేక్షించే బాధ్యతను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్వహిస్తుంది. విమానయాన సంస్థలు తమ కార్యకలాపాల ఖర్చుల ఆధారంగా టికెట్‌ ధరలను నిర్ణయించి, సంబంధిత వివరాలను డీజీసీఏకు సమర్పించాలి. ప్రయాణికులు బుకింగ్‌ సమయంలో చెల్లించాల్సిన మొత్తం ధరను స్పష్టంగా చూపించడంతో పాటు టికెట్‌పైనా పేర్కొనాలి. బేస్‌ ఫేర్‌, పన్నులు, ఇతర రుసుములు, టికెట్‌ రద్దు ఛార్జీలు, రీఫండ్‌ వివరాలను విడివిడిగా వెల్లడించాలి. ప్రభుత్వ పన్నులు, విమానయాన సంస్థలు వసూలు చేసే సేవా రుసుముల మధ్య తేడాను కూడా స్పష్టంగా చూపించాలి. అధిక డిమాండ్‌ ఉన్న సమయంలో విమాన టికెట్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం ప్రస్తుతం విచారణలో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

ట్యాగ్లు
విమాన టికెట్ ధరలువిమానయాన నిబంధనలుకేంద్ర ప్రభుత్వండీజీసీఏవిమాన ప్రయాణంభారతీయ విమానయానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో
సినిమాలు

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !
సినిమాలు

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం
క్రీడలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా
రాజకీయాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు
రాజకీయాలు

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్
రాజకీయాలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌
రాజకీయాలు

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
సినిమాలు

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు
జనరల్

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!