

అనంతిక సనీల్ కుమార్, ఊర్వశి, జయరామ్, సంజన కృష్ణమూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'పరిమళ అండ్ కో' ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన కథతో వచ్చింది. దర్శకుడు పండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యోగిబాబు, శాండీ, సంతోష్, శోభన్ కీలక పాత్రలు పోషించారు. కుటుంబంలోని చిన్న కుమార్తెను వేధిస్తున్న ఓ స్థానిక గ్యాంగ్‌స్టర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో, ఆ హత్య చుట్టూ ఒక మధ్యతరగతి కుటుంబంలో అనుమానాలు మొదలవుతాయి. అసలు హత్య ఎవరు చేశారు? ఆ కుటుంబానికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.
జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కథకు ప్రశంసలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే విడుదలైన నెల రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జూలై 10 నుంచి 'పరిమళ అండ్ కో' స్ట్రీమింగ్ కానుందని జీ5 అధికారికంగా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!