

కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ 2పై మొదటి సినిమా విజయంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన సర్దార్ తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో సీక్వెల్‌పై కూడా అంచనాలు పెరిగాయి. అయితే సర్దార్ 2 మాత్రం థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది.
థియేట్రికల్ రన్ పూర్తయిన కొద్దికాలానికే, కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఓటీటీలో మాత్రం ఊహించని స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో నిలిచినట్లు సమాచారం. థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కించుకోని సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఇంత వేగంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్, ఎస్.జే. సూర్య తదితరులు నటించగా, ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!