
ఓటీటీ

‘రంగస్థలం’ వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మళ్లీ కలిసే ప్రాజెక్ట్ ఆర్సీ17 రూపుదిద్దుకుంటోంది. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైందని, త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రారంభం కానుండగా, నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!