

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విద్యా సంబంధిత అంశాలపై నిర్వహించనున్న నిరసన కార్యక్రమం నేపథ్యంలో భారత్‌కు బయల్దేరినట్లు ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఆయన “భారత్‌కు వస్తున్నాను... నా భవితవ్యాన్ని రాజ్యాంగం చేతుల్లో ఉంచుతున్నాను. #జైభీమ్” అంటూ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
దిప్కే ఢిల్లీకి చేరుకున్న అనంతరం జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరనున్నట్లు సమాచారం. ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్ర లీక్ ఆరోపణలు సహా పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై జవాబుదారీతనం కోరుతూ ఈ నిరసన చేపట్టనున్నారు. మే నెలలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, పరీక్షల పారదర్శకత వంటి అంశాలపై యువత ఆధారిత వేదికగా ప్రచారం పొందుతోంది. ఈ ఉద్యమానికి మద్దతు పెరుగుతుండగా, దాని లక్ష్యాలపై విమర్శలు కూడా కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!