

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో గ్రామీణ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో భాజపా ఆధ్వర్యంలో వడపర్తి నుంచి చీకటిమామిడి వరకు 12 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
విలేకరులతో మాట్లాడిన రామచందర్‌రావు, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సాగునీటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టామని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ పాల్గొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!