
జనరల్

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన మోదీ, హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయాన్ని కొనియాడారు. ఈ విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తల సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలేనని పేర్కొంటూ వారిని అభినందించారు.
ఈ సందర్భంగా తాను "56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల 56 ఏళ్లు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీని ఉద్దేశించివేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ‘56 అంగుళాల ఛాతీ’ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన రాజకీయ విమర్శలకు కొనసాగింపుగా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!