

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మతం, భాష పేరుతో ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటివరకు ప్రయత్నాలు జరిగాయని, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకున్నారని రేవంత్ ఆరోపించారు. తాజాగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆయన పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలకులు గతంలో సైమన్ కమిషన్‌ను ఉపయోగించుకున్నట్లుగా, ప్రస్తుతం బీజేపీ ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుంటోందని రేవంత్ వ్యాఖ్యానించారు. నాడు భగత్‌సింగ్ పోరాడితే.. ఇప్పుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదని, దేశ ప్రజల ఓటు హక్కుతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. సీఈసీపై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!