
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ రాజ్ శాఖకు లభించిన ప్రతిష్ఠాత్మక అవార్డులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
క్యాబినెట్ సమావేశంలో అధికారులు కేంద్ర అవార్డులను ప్రదర్శించగా, వాటిని ప్రశంసించిన ముఖ్యమంత్రి ఈ విజయాలను ఇతర శాఖలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి శాఖ అత్యుత్తమ పనితీరును కనబరిచి రాష్ట్రానికి మరిన్ని జాతీయ స్థాయి గుర్తింపులు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!