

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రూ.19 కోట్లతో సాలు మండపాల నిర్మాణ ప్రతిపాదనపై దేవాదాయ శాఖ కమిషనర్, ధర్మకర్తల మండలి మధ్య విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భక్తులకు అత్యవసరమైన క్యూ కాంప్లెక్స్, ప్రజా సౌకర్యాల కాంప్లెక్స్, మరుగుదొడ్ల నిర్మాణానికే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ సాలు మండపాల ప్రతిపాదనను ధర్మకర్తల మండలి రెండుసార్లు ఏకగ్రీవంగా తిరస్కరించినట్లు సమాచారం.
అయితే తన విచక్షణాధికారాలను వినియోగిస్తూ సాలు మండపాల నిర్మాణానికి టెండర్లు నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశించడంతో దేవస్థానం ఈఓ టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు తీర్మానాన్ని పక్కనపెట్టడంపై ధర్మకర్తల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ నిర్ణయాలకు గౌరవం లేకపోతే బోర్డు ఉనికి ఎందుకని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కమిషనర్ పనితీరును ప్రస్తావిస్తూ చైర్మన్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!