
ఓటీటీ

కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. వైరల్ అవుతున్న సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేస్తూ, ప్రజలు ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని, ధృవీకరించని సమాచారాన్ని షేర్ చేయవద్దని సూచించారు. ప్రస్తుతం అభిజిత్ దీప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా స్థలంలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్ట్ చేయడం గానీ జరగలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కాక్రోజ్ జనతా పార్టీ కూడా అధికారికంగా వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంటూ, ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!