
జనరల్

గత వారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈరోజు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 442.93 పాయింట్లు (0.57%) పడిపోయి 77,708.52 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 95.80 పాయింట్లు (0.39%) క్షీణించి 24,238.50 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో పాటు బ్యాంకింగ్ రంగంలోని బలహీనత కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!