
ఓటీటీ

బీజేపీ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఖైరతాబాద్‌లో ఓటమి భయంతోనే సీఎం కోర్టును ఆశ్రయించారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇరు పార్టీలు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని డీకే అరుణ ఆరోపించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నైతిక బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ఫిరాయింపుల రాజకీయాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!