

హరియాణా, మహారాష్ట్రల్లో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్, ఇతరత్రా అక్రమాలు జరిగాయని పరిశోధనాత్మక జర్నలిస్టుల గ్రూపు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సంచలన కథనం ప్రచురించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. ఓటర్లు వేసిన ఓట్లకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉందని మంగళవారం తన కథనంలో పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీరులోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అంతర్గత ఎన్నికల రికార్డులను ఈ గ్రూపు పరిశీలించింది.
51నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని పేర్కొంది. వీటిలో 32నియోజకవర్గాల్లో ఈ రెండు లెక్కల నడుమ వ్యత్యాసం కనిపించగా.. మిగతా 19 స్థానాల్లో.. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించిన ఓటర్ల సంఖ్యను ఎన్నికల అధికారులు సున్నాగా నమోదుచేశారని తెలిపింది. ఈ కథనాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ఖండించింది. దీనిపై బుధవారం వివరణ ఇస్తూ.. అందులో పేర్కొన్న గణాంకాలను తప్పులతడకలుగా పేర్కొంది. సదరు స్థానాల్లో మొత్తం రిజిస్టరైన ఓటర్ల సంఖ్యను పోలైన ఓట్లుగా సదరు కథనంలో పొరబడ్డారని తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!