
సినిమాలు

వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో హత్యకు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, నిధుల కదలికలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరితో పాటు నిందితులు యాదటి సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. హత్యకు సంబంధించినట్లు ఆరోపణలు ఉన్న చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలు, నిధుల కదలికలను పరిశీలిస్తున్న ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దర్యాప్తును కొనసాగిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!