
జనరల్

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజా ఉద్యమాలకు గద్దర్ చిరునామాగా నిలిచారని కొనియాడారు. హైదరాబాద్‌లో మంగళవారం ‘ప్రజా యుద్ధ నౌక గద్దర్’ డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గద్దర్ వంటి మహనీయుడి జీవితం, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే డాక్యుమెంటరీని రూపొందించే ప్రయత్నం అభినందనీయమని అన్నారు.
గద్దర్ ఆశయాలు, ప్రజా ఉద్యమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె, సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్ వెన్నెలతో పాటు డాక్యుమెంటరీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!