

హరీష్ రావు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశాలు పూర్తిగా రహస్యంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 167 టీఎంసీల నీటితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతుండగా, సమావేశాల మినిట్స్‌ను కూడా ప్రజలకు వెల్లడించడం లేదని విమర్శించారు. తెలంగాణ తరఫున సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని కూడా ఆయన ఆరోపించారు.
పోలవరం-కావేరి అనుసంధాన ప్రతిపాదన నేపథ్యంలో నీటి పంపకాలపై ఆందోళన వ్యక్తం చేసిన హరీష్ రావు, ఈ ప్రణాళిక అమలైతే ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు తగ్గిపోవడం వల్ల సాగునీరు, తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని, పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!