
సినిమాలు

హైదరాబాద్‌లో నకిలీ ఫారం-7 పత్రాలకు సంబంధించిన వ్యవహారంలో కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ బూత్ స్థాయి ఏజెంట్ బాలచందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నమోదు అధికారి ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, న్యాయ సలహా తీసుకున్న అనంతరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
బాలచందర్ నకిలీ ఫారం-7 పత్రాలను ఉపయోగించి సుమారు 30 మంది ఓటర్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫారం-7 ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించిన పత్రాల సమర్పణలో అక్రమాలు జరిగాయా అనే కోణంలో వివరాలను పరిశీలిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!