
సినిమాలు

సీజేపీ నేతలకు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో, జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జంతర్ మంతర్ భారత ప్రజలదని, ఆ ప్రదేశాన్ని తిరిగి సాధించుకుంటామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి శాంతియుతంగా నిరసనలు తెలియజేయడం నేరం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని తన వ్యాఖ్యల ద్వారా సూచించారు.
నిరసనల్లో పాల్గొన్న యువతను జైలులో పెట్టడం పిరికిపంద చర్య అని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ఇండియా కూటమి నేతల లక్ష్యం ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఆంక్షలు, సీజేపీ నేతలకు విధించిన జైలు శిక్ష నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!