
జనరల్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీనాక్షి నటరాజన్ అంశంపై బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ, బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్‌పై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అసలు విషయాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు లేరని స్పష్టం చేసిన జగ్గారెడ్డి, ఒకవేళ ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌తో వ్యక్తిగత సంబంధాలు ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంటూ, ఆయన చేసిన విమర్శలపై సరైన సమయంలో స్పందిస్తానన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు ఎవరైనా రావచ్చని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!