
గాసిప్స్

₹10, ₹20 విలువల పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేసి, అనంతరం సాధారణ చలామణిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లకు ఇవి ప్రత్యామ్నాయం కాదని, వాటితో పాటు చలామణిలో ఉంటాయని ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం పాలిమర్ నోట్ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే ₹10, ₹20 విలువలలో ఒక్కోటి సుమారు 100 కోట్ల నోట్లు ముద్రించే ప్రణాళిక ఉంది. పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నీరు, తేమ, చిరిగిపోవడం వంటి సమస్యలకు తక్కువగా గురవుతాయి. అలాగే నకిలీ కరెన్సీని అరికట్టేందుకు అధునాతన భద్రతా లక్షణాలు కూడా వీటిలో ఉంటాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!