

లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సమంజసం కాదని పేర్కొంటూ, అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని సూచించింది.
63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, లోతుకుంట ప్రైవేటు భూముల్లో హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. రూల్ ఆఫ్ లా పరిరక్షణకు రంగనాథ్‌ను తొలగించడం అవసరమని అభిప్రాయపడింది. ఇదే సమయంలో రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేసి కోర్టుకు క్షమాపణలు తెలిపారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొంటూ, వివాదాస్పద 40 ఎకరాల భూమిలో హైడ్రా బృందం ప్రవేశించలేదని, పిటిషనర్ ఆరోపణలు అసత్యమని వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!