

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి చౌరస్తాలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు రంగధాంపల్లి చౌరస్తాలో భారీ ఏర్పాట్లు చేపట్టాయి. భూమిపూజ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలంలో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి కవిత బయలుదేరి, 9 గంటలకు సిద్దిపేటకు చేరుకోనున్నారు. తొలుత శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మినార్ సమీపంలోని జానుల్లా షా దర్గాలో చాదర్ సమర్పించి, ఆర్డీవో కార్యాలయం సమీపంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉదయం 10 గంటలకు రంగధాంపల్లి చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!